Header Banner

కేంద్రం నివేదికలో ఏపీ.. పెట్టుబడుల వరద, వృద్ధిరేటులో రికార్డు! చంద్రబాబు విజన్‌కు విజయఫలితం!

  Sun Apr 06, 2025 15:17        Politics

రాష్ట్ర పురోగతిపై కేంద్ర ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేసింది. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో ఏపీ.. మొత్తంగా 8.21 శాతం మేర వృద్ధి రేటును అందుకుంది. ఏపీ కంటే తమిళనాడు ముందంజలో ఉంది. 9.69 శాతం మేర వృద్ధి రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలో మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్, వ్యవసాయ రంగాల్లో వృద్ధి రేటు కనిపించినట్ల కేంద్ర ప్రభుత్వంలో తన నివేదికలో పొందుపరిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలుస్తోండటం, పారిశ్రామిక విధానాలు, పరిపాలనలో పారదర్శకత.. వంటి చర్యలు పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని
పెంపొందడానికి దోహదం చేశాయి. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ అమలులో కూడా ఏపీ అగ్రగామిగా గుర్తింపు పొందింది.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!


రాష్ట్రాన్ని.. దేశంలోనే నంబర్ వన్‌గా మార్చడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తోండటం వల్లే ఏపీ అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేయగలిగింది. గత ఏడాది జూన్‌లో చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఆర్థికరంగంపై దృష్టి పెట్టారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న కీలక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తూ వచ్చారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి సంభవించిన నష్టాల నుండి కోలుకోవడానికి తక్షణ చర్యలను తీసుకుంటోన్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంస్కరణలు సానుకూల ఫలితాలను ఇస్తోన్నాయి. పారిశ్రామిక పెట్టుబడులను మరింత ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, స్థిరమైన ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా మూడు కొత్త పారిశ్రామిక విధానాలను చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెల కాలంలో దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, అయిదు లక్షల ఉద్యోగాల కల్పన వంటి చర్యలు.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనం. చంద్రబాబు దార్శనిక విధానాల ద్వారా ఈ పారిశ్రామిక పునరుజ్జీవనానికి దోహదపడింది. ఏపీ తన వృద్ధిరేటును గణనీయంగా పెంచుకోవడానికి, దేశ ఆర్థిక ప్రగతికి ఓ గ్రోత్ ఇంజిన్‌గా ఎదుగుతోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #InvestmentBoom #RecordGrowth #ChandrababuNaidu